మనకున్న క్రియేటీవ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకడు. స్వతహాగా లెక్కల మాస్టార్ అయిన సుక్కు... ఏం చేసినా ఓ లెక్క ప్రకారం చేస్తుంటాడు. కథల అల్లిక, హీరోల క్యారెక్టరైజేషన్, కథలో ట్విస్టులు, టైటిల్.... ఇలా ప్రతీ దానికీ ఓ లెక్క ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు సుక్కు. ఈ సినిమా అప్ డేట్స్ గురించి బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుధవారం బన్నీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినిమాటైటిల్ని ప్రకటించబోతున్నారు.
అయితే ఈలోగా ఈ టైటిల్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రానికి 'పుష్ప' అనే పేరు పెట్టినట్టు టాక్. దాంతో.. బన్నీ ఫ్యాన్స్ అంచనాలన్నీ తలకిందులైపోయాయి. బన్నీ మాస్ లుక్లో కనిపించే సినిమా ఇది. టైటిల్ కూడా మాసీగా ఉంటుందనుకున్నారు. రంగస్థలం లా యూనిక్ టైటిల్ పెడతారని భావించారు. కానీ.. పుష్ష అనే సాఫ్ట్ టైటిల్ కే మొగ్గు చూపించాడు. ఈ టైటిల్ నానడానికి కాస్త టైమ్ పడుతుంది. ఈలోగా.. ఈ టైటిల్ పై అంచనాలు భారీగా పెంచుకున్న బన్నీ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది. సినిమాలో హీరో పేరు పుష్షక్ నారాయణ్ అని, తనని అందరూ పుష్ష అని పిలుస్తారని, అందుకే ఈ టైటిల్ పెట్టారని చెప్పుకుంటున్నారు.