లాక్‌ డౌన్‌ జూన్‌ వరకూ.? టాలీవుడ్‌ పరిస్థితేంటి.?

మరిన్ని వార్తలు

ప్రాణాల కంటే సినిమా ఎక్కువేమీ కాదు కదా.! తప్పదు, పరిశ్రమకు జరుగుతున్న నష్టాన్నీ, వ్యక్గితంగా తాము పడుతున్న ఇబ్బందుల్నీ పక్కన పెట్టి మరీ సినీ ప్రముఖులు, తమను అభిమానిస్తోన్న సినీ అభిమానుల కోసం సేవా దృక్పథంతో ముందుకొస్తున్నారు. సినిమా పరిశ్రమలో షూటింగులు ఆగిపోయాయి. ది¸యేటర్లూ ముతపడ్డాయి. అయినా, ప్రజల్ని కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తం చేసేందుకు సినీ పరిశ్రమ తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ ముగుస్తుందా.? అంటే, ‘ముగియకపోవచ్చు’ అనే సంకేతాలు అందుతున్నాయి.

 

తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచనల్ని బట్టి చూస్తే, జూన్‌ 3 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగాలి. అంటే, ఏప్రిల్‌తోపాటు మే నెల కూడా పూర్తిగా సినిమా ది¸యేటర్లు, సినిమా షూటింగులు బంద్‌ అవుతాయన్నమాట. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో తొలిసారి సమ్మర్‌ సీజన్‌ మిస్‌ అవుతోందని అనుకోవాలి. కానీ, తప్పనిసరి పరిస్థితి ఇది. ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి వుండాల్సిందేనని సినీ పరిశ్రమ ఇప్పటికే ప్రకటించింది. సినిమా కష్టాల్ని పక్కన పెట్టి, సెలబ్రిటీలు నిత్యం అభిమానులకు అందుబాటులో వుంటున్నారు సోషల్‌ మీడియా వేదికగా. ప్రజలకు ఇంకా ఏం చేయగలం.? అన్న దిశగా సమాలోచనలు చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడూ తన బాధ్యతను మరింత గొప్పగా నిర్వహిస్తోంది. హేట్సాఫ్‌ టు టాలీవుడ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS