బ‌న్నీ టైటిల్ రూమ‌రేన‌ట‌!

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి శేషాచ‌లం అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బన్నీ ఇమేజ్‌కి ఈ పురాత‌న‌మైన టైటిల్ ఎలా స‌రిపోతుందా? అని ఫ్యాన్స్ అనుమానాలు వ్య‌క్తం చేశారు. శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగే క‌థ ఇద‌ని, అందుకే ఆ టైటిల్ పెట్టార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

 

అయితే ఎట్ట‌కేల‌కు దీనిపై చిత్ర‌బృందం స్పందించింది. ``కొన్ని వెబ్ సైట్ల‌లో అల్లు అర్జున్ 20వ సినిమాకి సంబంధించిన‌ టైటిల్ పై వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిలో నిజం లేదు. టైటిల్‌కి ఇంకా ప్ర‌క‌టించ‌లేదు`` అని నిర్మాత‌లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే బ‌న్నీ సినిమా కొత్త షెడ్యూల్ మొద‌లుకానుంది. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అన‌సూయ ఓ కీల‌క పాత్రలో క‌నిపించ‌నుంది. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS