అల్లు అర్జున్ - సుకుమార్ నుంచి ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. కేరళలో బన్నీ లేకుండా కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిపారు. ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఈ షెడ్యూల్‌లో బన్నీతో పాటు మరికొంతమంది ప్రధాన నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ టైటిల్ ప్రకటించలేదు. అయితే త్వరలోనే టైటిల్‌ని అధికారికంగా ప్రటిస్తారని సమాచారం.
ఈ చిత్రానికి 'సింహాచలం' అనే పేరు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథ ఇది. అటవీ ప్రాంతంలో జరిగే కథ. సింహాచలం అడవుల్లో ఈ కథ నడుస్తుంది. అందుకే సింహాచలం అనే పేరు పెట్టాలని సుకుమార్ భావిస్తున్నాడు. అయితే బన్నీ ఈ టైటిల్‌కి ఒప్పుకుంటాడా? లేదా? అనేది తెలియాల్సివుంది. బన్నీ ఓకే అంటే గనుక.. అతి త్వరలోనే టైటిల్‌ని ప్రకటించేస్తారు.