అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. రష్మిక కథానాయిక. ఇప్పటికే అల్లు అర్జున్ లేకుండా కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. బన్నీ షూటింగ్ లో పాల్గొనాల్సివుంది. అయితే ఇప్పటి వరకూ బన్నీ సెట్లోకి అడుగుపెట్టలేదు. ఫిబ్రవరి నుంచి బన్నీ షెడ్యూల్ మొదలెడదామనుకున్నారు. అయితే... బన్నీ ఇంకా టైమ్ కావాలని అడుగుతున్నాడట. ఈ పాత్ర కోసం కొంత బరువు పెరగాల్సివుంది.
పైగా తన యాస భాషలు మార్చాల్సివస్తోంది. దానికి సంబంధించిన కసరత్తులలో బన్నీ బిజీగా ఉన్నాడని సమాచారం. పైగా అల వైకుంఠపురములో మూడ్ నుంచి బన్నీ బయటకు రాలేదు. కుటుంబంతో కొంత సమయం గడపాలని భావిస్తున్నాడట. అందుకే... సుకుమార్ షూటింగ్‌కి డుమ్మా కొడుతున్నాడు. మార్చి నుంచి ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. అప్పుడే బన్నీ కూడా సెట్‌కి వస్తాడని తెలుస్తోంది.