‘డియర్ కామ్రేడ్’ తర్వాత మరో ఫ్లాప్ చవిచూశాడు విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో. తన సినిమాలు ఫ్లాపవుతున్నా, తదుపరి సినిమాకి అంచనాలు పెంచేయగలుగుతున్నాడు విజయ్. ఇది కాస్త ఆసక్తికరమైన అంశమే. అయితే, ఆ అంచనాల్ని అందుకోవడంలో ప్రతిసారీ విఫలమైతే.. కష్టమే కదా.! ‘ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అయితే ఇస్తాను..’ అని విజయ్ చెబుతున్నాడుగానీ, ‘అర్జున్ రెడ్డి’ హేంగోవర్ నుంచి ఆయన బయటకు రాలేకపోతున్నాడు. ఇక, ఇప్పుడు బాధ్యత పూరి జగన్నాథ్ నెత్తిన గట్టిగానే పడినట్లుంది. పూరి - విజయ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది.
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాడు. మరి, ఇంతటి ప్రతిష్టాత్మక సినిమా భవిష్యత్తు ఏమవుతుంది.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. విజయ్ అయినా, ఇంకో హీరో అయినా.. ఖచ్చితంగా ముందరి సినిమా తాలూకు ఎఫెక్ట్‌ని ఫేస్ చేయాల్సిందే. నిజానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాపై విజయ్‌కి ముందు నుంచీ పెద్దగా నమ్మకాల్లేవ్. ఆ విషయాన్ని విజయ్ పరోక్షంగా సినిమా ప్రమోషన్లలో స్పష్టం చేసేశాడు. అయినాగానీ, సినిమా ప్రమోషన్ కోసం తనవంతుగా కష్టపడ్డాడు. ఫలితం నెగెటివ్ అయ్యింది. ఇదిలా వుంటే, విజయ్ హీరోగా స్టార్ట్ అయిన ఇంకో సినిమా ‘హీరో’. అది నిర్మాణ దశలోనే ఆగిపోయింది.
సో, ‘ఫైటర్’ సినిమాపై ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఎలా చూసినా, పూరి జగన్నాథ్‌కి ది నిజంగానే టఫ్ టాస్క్. అయితే, కొత్త ఫేజ్‌లోకి వచ్చాం.. సంచలనం సృష్టించబోతున్నాం.. అని ధీమాగా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ.. గత వైఫల్యాల్ని పక్కన పెట్టి మరీ.