హీరోయిన్ రష్మిక మండన్నాని, హీరో నితిన్ ఆటపట్టించాడు. అదీ ‘డాగ్ బిస్కెట్స్’, ‘పిడిగ్రీ’ అంటూ. అదేంటీ, రష్మికకీ వాటికీ సంబంధమేంటి.? అంటే, రష్మిక ఓ సారి డాగ్ బిస్కెట్స్‌ని టేస్ట్ చేసిందట. ఆ విషయాన్ని నితిన్, తన తాజా సినిమా ‘భీష్మ’ ప్రమోషన్స్‌లో వెల్లడించాడు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా రష్మిక షాక్‌కి గురయ్యింది. నితిన్‌ని కంట్రోల్ చేయడానికి రష్మిక చాలా ప్రయత్నించిందిగానీ.. వీలు కాలేదు. నితిన్ - రష్మిక మధ్య ఈ ఫన్ చాలాసేపు నడిచింది.
‘జస్ట్ ఫర్ ఫన్’ అని నితిన్ చెప్పడం, రష్మిక.. ఈ మొత్తం ఎపిసోడ్‌ని మేగ్జిమవ్‌ు ఎంజాయ్ చేయడం చాలా క్యూట్‌గా అనిపించింది. తనకు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనే కోరిక చాలా చాలా ఎక్కువనీ, ఈ క్రమంలోనే ఓ సారి డాగ్ బిస్కెట్స్ టేస్ట్ ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకున్నాననీ, ఆ కారణంగానే డాగ్ బిస్కెట్‌ని టేస్ట్ చేశానని రష్మిక చెప్పింది. ‘ఎలా వుందది.?’ అనడిగితే ‘బాగానే వుంది’ అని రష్మిక సమాధానమిచ్చింది. బహుశా ఇదే, రష్మిక ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమో.. అని నితిన్ సెటైర్లు కూడా వేశాడు.
ఇదిలా వుంటే, రష్మిక డాన్సుల గురించి నితిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘వాట్టే బ్యూటీ’ పాట కోసం డాన్స్ మాస్టర్ ఓ క్లిష్టమైన మూమెంట్ కంపోజ్ చేశారనీ, తానైతే ఆ మూమెంట్ వద్దని చెప్పేశాననీ, రష్మిక మాత్రం చాలా చాలా ప్రాక్టీస్ చేసి సులువుగానే ఆ మూమెంట్ చేసేసిందనీ, అయితే.. ఆ తర్వాత ఆమె కాళ్ళు పట్టేసి చాలా ఇబ్బంది పడిందని నితిన్ చెప్పాడు. ‘కమిట్‌మెంట్ విషయంలో రష్మికకి హేట్సాఫ్’ అన్నాడు నితిన్. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ‘భీష్మ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే.