దిల్ రాజు బ్యాన‌ర్‌లో.. బ‌న్నీ

మరిన్ని వార్తలు

ఆర్య‌తో అల్లు అర్జున్‌కి స్టార్ డ‌మ్ వ‌చ్చేసింది.  నిర్మాత‌గా దిల్‌రాజుకీ ఈ సినిమా ఓ గొప్ప మ‌లుపు.  ఆ త‌ర‌వాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో 'డీజే' వ‌చ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతోంది. అవును.. దిల్ రాజు సంస్థ‌లో బ‌న్నీ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే... అగ్రిమెంట్ల‌పై బ‌న్నీ సంత‌కాలు కూడా చేసేశాడు. ఈ చిత్రానికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. 

 

దిల్‌రాజు సంస్థ‌లోనే వేణుకి ఇది మూడో సినిమా. 'ఓ మై ఫ్రెండ్‌', 'ఎంసీఏ' చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు వేణు.  ఓ మై ఫ్రెండ్ ఫ్లాప్ అయ్యింది. ఎంసీఏ హిట్టు. అప్ప‌టి నుంచీ.. ఈ స్క్రిప్టుపై క‌స‌ర‌త్తులు చేస్తూనే ఉన్నాడు వేణు రామ్‌. ఎట్ట‌కేల‌కు స్క్రిప్టు పూర్త‌య్యింది. ఈ క‌థ విన‌గానే బ‌న్నీకీ న‌చ్చేసింది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బ‌న్నీ. ఆ త‌ర‌వాత సుకుమార్ సినిమా ఉంటుంది. మ‌రి.. వేణు శ్రీ‌రామ్ సినిమాని ఎప్పుడు ప‌ట్టాలెక్కిస్తాడో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS