ప్రస్తుతం `పుష్ష`తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. దీని తరవాత.. కొరటాల శివ తో ఓ సినిమా చేయబోతున్నాడు. `ఆచార్య` తరవాత కొరటాల శివ చేయబోయే సినిమా కూడా అదే. కొరటాల సినిమాల్లో ఏదో ఓ సోషల్ మెసేజ్ బలంగా ఉంటుంది. ఈసారి కూడా ఓ బలమైన పాయింట్ కి తనదైన శైలిలో కమర్షియల్ హంగులు జోడించే ప్రయత్నంలో ఉన్నాడట. విద్యార్థులు - రాజకీయాలు అనే పాయింట్ పై కొరటాల కథ సాగబోతోందని తెలుస్తోంది. స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలని, వాళ్లతోనే మార్పు సాధ్యం అవుతుందని చెప్పే కథ ఇదని తెలుస్తోంది.
అయితే ఇలాంటి కథతోనే `సైనికుడు` తెరకెక్కింది. మహేష్ - గుణ శేఖర్ కాంబోలో వచ్చిన సినిమా ఇది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మళ్లీ కొరటాల అదే పాయింట్ పట్టుకుని సినిమా తీయడం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే కొరటాల టేకింగ్, కథ చెప్పే విధానం, అందులో కమర్షియల్ హంగులు జోడించే వైనం వేరుగా ఉంటాయి. వాటిపై అయితే ఫ్యాన్స్ కి భరోసానే. మరి ఈసారి ఈ పాయింట్ ని కొరటాల ఎలా డీల్ చేస్తాడో చూడాలి.