ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రెడీ అవుతున్నా - అందరి దృష్టీ `అలా వైకుంఠపురములో`, `సరిలేరు నీకెవ్వరు` సినిమాలపైనే ఉంది. ఈ రెండింటి రిలీజ్ డేట్లూ ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. సెన్సార్ పూర్తయినా, విడుదల దగ్గర పడుతున్నా - ఇప్పటి వరకూ ఇద్దరూ కామ్‌గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి మహేష్ సినిమా 11న, బన్నీ సినిమా 12న రావాలి. ఈ విడుదల తేదీల్లో మార్పు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. బన్నీ సినిమా కూడా 11నే రావడానికి రెడీ అవుతోందని టాక్.
ప్రస్తుతం `అల వైకుంఠపురములో` కొత్త పోస్టర్లు కూడా రెడీ అయిపోతున్నాయని తెలుస్తోంది. ఈరోజు సాయింత్రానికల్లా బన్నీ రిలీజ్ డేట్ డిసైడ్ అవ్వబోతోంది. బన్నీ 11న వస్తే మహేష్ సినిమాతో నేరుగా పోటీ పడినట్టే. కాకపోతే మహేష్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఒకవేళ బన్నీ 11న రావాలనుకుంటే, సరిలేరు నీకెవ్వరు 10నే వచ్చేసే వీలుందని సమాచారం. రెండూ ఒకే రోజున ఢీ కొట్టే ఛాన్సులూ ఉన్నాయి. మొత్తానికి సంక్రాంతి వార్.. ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుందనే అనుకోవాలి.