తనకి ఏదైనా సినిమా నచ్చితే ఆ చిత్రం కోసం పనిచేసిన అందరిని ప్రత్యేకంగా అభినందించే అలవాటు ఉన్న అతితక్కువ మందిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఆయన నిన్న విడుదలైన గీత గోవిందం చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలోనే ఈ సినిమా రిజల్ట్ గురించి పాజిటివ్ గా చెప్పేశారు.
ఇక ఇప్పుడు సినిమా విడుదలయ్యాక ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ శనివారం తన ఫాం హౌస్ లో పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాడట. అయితే అల్లు అర్జున్ ఇలా ఇంత పెద్ద స్థాయిలో పార్టీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఈ చిత్ర నిర్మాత అయిన బన్ని వాసు ఆయనకి ప్రాణ స్నేహితుడు కావడం, ఇదే విషయాన్నీ ఆయన చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది.
ఇదే సమయంలో గీత గోవిందం సక్సెస్ మీట్ ఈ ఆదివారం హైదరాబాద్ లో జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. నిన్న రాత్రే ఆయన ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ తో కలిసి చూడడం జరిగింది.
ఏదేమైనా.. గీత గోవిందం టీం ఈ సక్సెస్ తో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.