విజయ్ దేవరకొండ-రశ్మిక జంటగా నటించిన గీత గోవిందం చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకి ముందే ఈ సినిమాని “లీకుల” వ్యవహారం వార్తల్లో నిలబెట్టేసింది.
ఇక ఈ గండాలని దాటుకుని నిన్న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో గీత గోవిందం యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, మొదటిరోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలోనే సందడి చేసినట్టుగా తెలుస్తున్నది.
మొదటిరోజు పూర్తయ్యాక ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలలో సుమారు రూ 6 కోట్ల వరకు వసూలు కాగా మిగతా చోట్ల వచ్చిన కలెక్షన్స్ కలుపుకుంటే దాదాపుగా రూ 10 కోట్ల (షేర్) సాధించినట్టుగా ట్రేడ్ సమాచారం.
ఇక ఈరోజు నుండి వచ్చే ఆదివారం వరకు గీత గోవిందం చిత్రానికి కలెక్షన్స్ పంట పండనుంది అన్న అంచనాల నేపధ్యంలో తొలి 5 రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టొచ్చు అని భావన కలుగుతున్నది.