బుల్లితెర హాట్ యాంకర్స్ అనసూయ, రష్మీలలో అనసూయ అనూహ్యంగా దూసుకొచ్చింది. మంచి సినిమాలను ఎంచుకుంటూ, గుర్తింపు ఉన్న పాత్రలతో రిజిస్టర్ అయ్యింది. అనసూయకు గట్టి పోటీ అయిన రష్మీ మాత్రం వరుస సినిమాలతో బోర్లా పడింది. అది కూడా సేమ్ జోనర్ మూవీస్‌తో బోర్ కొట్టించేసింది.
అసలు రష్మీ నటించిన చాలా సినిమాలు అసలెప్పుడొచ్చాయో, ఎప్పుడు పోయాయో తెలియని పరిస్థితి. కానీ అనసూయ అలా కాదు, చేసినవి తక్కువ సినిమాలే కానీ, పాపులారిటీ మాత్రం హీరోయన్స్‌కి ధీటుగా సంపాదించింది. అందుకే రష్మీ కూడా అనసూయ బాటనే ఎంచుకోవాలనుకుంటోందట. ఆచి తూచి కథలను ఎంపిక చేసుకోవాలనుకుంటోందట.
తాజాగా రేష్మీ నుండి వస్తున్న సినిమా 'అంతకుమించి'. ఈ సినిమాలో రష్మీ ఎప్పటిలా కన్నా కాస్త ఎక్కువగానే అందాల విందు చేసేసింది. అయితే అది అదే ఇది ఇదే అన్నట్లుగా గ్లామర్‌తో పాటు పర్‌ఫామెన్స్ కూడా దంచేసిందట ఈ సినిమాలో. గ్లామర్‌తో పాటు, కొన్ని యాక్షన్ సీన్స్‌లో కూడా నటించిందట. రష్మీపై చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కొత్త దర్శకుడు జానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.