అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్... మొద‌లెట్టేశారు

మరిన్ని వార్తలు

జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర‌వాత‌... హ్యాట్రిక్ కాంబోకి తెర లేచింది. అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా ప‌ట్టాలెక్కింది. ఆమ‌ధ్య లాంఛ‌నంగా మొద‌లైన ఈ చిత్రం.. ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లిపోయింది. ఈరోజు నుంచి హైద‌రాబాద్‌లో బ‌న్నీ సినిమా షూటింగ్ మొద‌లైంది. బ‌న్నీపై కొన్ని కీల‌క‌మైన సన్నివేశాల‌తో షూటింగ్ మొద‌లెట్టారు. హైద‌రాబాద్‌లోని యూసుఫ్ గుడాలో ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. మే 4 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లోనే షూటింగ్ జ‌ర‌గ‌బోతోంద‌ని స‌మాచారం.

ఈ చిత్రానికి `నాన్న నేను`, `అల‌క‌నంద‌` అనే పేర్లు ప‌రిశీలిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ట‌బు, బొమ‌న్ ఇరానీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త్రివిక్ర‌మ్ స్నేహితుడు సునీల్‌కి ఓ మంచి పాత్ర ద‌క్కింద‌ని స‌మాచారం. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ద‌స‌రాకి విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS