రీమేక్ చేద్దామా..? వ‌ద్దా...??

By iQlikMovies - October 25, 2018 - 12:42 PM IST

మరిన్ని వార్తలు

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ త‌ర‌వాత  త్రివిక్ర‌మ్ సినిమా అల్లు అర్జున్ తో ఫిక్స‌యిపోయింది.  డిసెంబ‌రు నుంచి షూటింగ్ మొద‌లెట్టేద్దాం అని కూడా ఫిక్స‌యిపోయారు. అయితే క‌థ విష‌యంలోనే  ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని స‌మాచారం అందుతోంది. 

బాలీవుడ్ సినిమా `సోను కె టిటు కి స్వీటీ`ని రీమేక్ చేస్తార‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే..  ఈవిష‌యంలో అటు బ‌న్నీ, ఇటు త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతూనే ఉన్నార్ట‌. ఈ సినిమాని రీమేక్ చేయాల‌న్న  ఆలోచ‌న త్రివిక్ర‌మ్‌ది కాదు. బ‌న్నీది.  అల్లు అర్జున్‌కి ఈ సినిమా బాగా న‌చ్చింద‌ని, దాన్ని త్రివిక్ర‌మ్ స్టైల్‌లో మార్చుకుంటే మినిమం గ్యారెంటీ ఉంటుంద‌ని బ‌న్నీ న‌మ్ముతున్నాడు. 

`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` త‌ర‌వాత ప్ర‌యోగాలు చేయ‌డానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేని బ‌న్నీ... ఈసారి రిస్కులు త‌క్కువ‌గా ఉండే క‌థ‌ని ఎంచుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు, రీమేక్ అయితే సేఫ్ ప్రాజెక్టుగా మిగులుతుంద‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ మాత్రం కొత్త క‌థ‌తో వెళ్తాం అని బ‌న్నీని స‌ర్దిచెబుతున్నాడ‌ని స‌మాచారం. 

ఈ వ్య‌వ‌హారం ఎప్ప‌టికి కొలిక్కి వ‌స్తుందో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS