'హలోబ్రదర్' సినిమా గుర్తుంది కదా.? అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ సినిమా కథే చిన్న చిన్న మార్పులతో 'సవ్యసాచి'గా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోందట.
అయితే ఆ సినిమాలో నాగార్జున డబుల్ రోల్, ఈ 'సవ్యసాచి'లో నాగచైతన్యది 'సోలో' రోల్. నాగచైతన్య ఒక్కడిగానే కన్పిస్తాడుగానీ, అతనిలో ఇంకో మనిషి వుంటాడు. ఆ ఆ ఇంకో మనిషి ఆధీనంలో ఎడమ చెయ్యి వుంటుంది. అదీ అసలు కథ. దీనికి వైద్య పరిభాషలో.. అంటూ ఏదో భాష్యం 'సవ్యసాచి' టీమ్ చెబుతున్నా, నాగార్జున మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. 'సవ్యసాచి' టీజర్ బావుందంటూ, 'హలోబ్రదర్' సినిమాతో పోలిక పెట్టడం ద్వారా అక్కినేని నాగార్జున ఈ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చేశాడు.
అయితే ఇది పాజిటివ్ పబ్లిసిటీనా.? ఈ పబ్లిసిటీ నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందా? అనేది వేరే విషయం. 'హలోబ్రదర్' సినిమాలో ఓ హీరో ఏం చేస్తే, ఇంకో హీరో కూడా అదే చేస్తుంటాడు. ఇంకో హీరోని ఏడిపించాలనుకున్నప్పుడు, మరో హీరో వెరైటీ వేషాలేస్తుంటాడు. అందులోంచి చాలా ఫన్ జనరేట్ అయ్యింది. ఫన్ మాత్రమే కాదు, చివర్లో యాక్షన్ ఎపిసోడ్‌ని కూడా భలేగా డిజైన్ చేశారు.
ఇప్పుడు 'సవ్యసాచి' సినిమాలోనూ అలాంటి సీన్లే కన్పిస్తున్నాయి. ఎలాగైతేనేం సూపర్ హిట్ మూవీ కాన్సెప్ట్‌ని కాస్త అటూ ఇటూగా వాడుకోవడం మంచిదే. 'హలోబ్రదర్' సినిమాలో తమిళనటుడు నెపోలియన్ సూపర్బ్‌గా వర్కవుట్ అయ్యింది. ఇందులో తమిళ నటుడు మాధవన్ ఆల్రెడీ 'ఇంపాక్ట్' చూపించేస్తోంది ట్రైలర్ ద్వారా.