అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ మళ్లీ స్టార్ట్‌ చేశారు!

By iQlikMovies - June 05, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్‌ 19 వ చిత్రం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న చిత్ర యూనిట్‌ తాజాగా రెండో షెడ్యూల్‌కి సిద్ధమవుతున్నారు. ఈ రోజు నుండి హైద్రాబాద్‌లో షూటింగ్‌ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్‌ పూజా హెగ్దే కూడా జాయిన్‌ కానుంది. త్రివిక్రమ్‌ - అల్లు అర్జున్‌ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.

 

తండ్రి సెంటిమెంట్‌తో సాగే కథ అని తెలుస్తోంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు కానీ, త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌గా ఈ సినిమాకి 'అలకనంద' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో హీరోపై సాగే కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించడం జరిగింది. తాజా షెడ్యూల్‌ విషయానికి వస్తే, హీరో, హీరోయిన్స్‌పై లవ్‌ ట్రాక్‌, ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌తో పాటు, మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. హైద్రాబాద్‌ శివారు ప్రాంతాల్లో కొన్ని లొకేషన్స్‌ని తాజా షెడ్యూల్‌కి వేదిక చేసుకుంది బన్నీ అండ్‌ టీమ్‌. హారికా హాసినీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS