అయ్యో పాపం.. అల్లు అర్జున్ మళ్ళీ బుక్కైపోయాడు

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన నిన్న విడుదల చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా టీజర్ ఇప్పుడు ఆయన కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, నిన్నటి టీజర్ లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అని ఏమి ఉండవు.. ఇండియా అంటే ఒక్కటి అని ఒక డైలాగ్ చెబుతాడు. ఇక ఇక్కడే మొదలైంది అసలు విషయం, అల్లు అర్జున్ ట్విట్టర్ లో తనని ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ గా పేర్కొన్నాడు.

 

దీనితో సినిమాలో చెప్పేది ఒకటి, భయట చేసేది ఒకటి అంటూ బన్నీ పైన సెటైర్లు వెయ్యడం మొదలుపెట్టారు. అయితే దీని పైన బన్నీ కాని చిత్ర యూనిట్ వారు కాని స్పందించలేదు. ఏదేమైనా బన్నీ కి సోషల్ మీడియాలో వల్ల ఇబ్బందులు అయితే బాగానే ఎదురుకుంటున్నాడు.

 

మొత్తానికి బన్నీకి చిన్న టీజర్ పెద్ద తలకాయ నొప్పి తెచ్చింది అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS