మహేష్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన అర్జున్ రెడ్డి హీరోయిన్..!

మరిన్ని వార్తలు

అర్జున్ రెడ్డి చిత్రంతో హీరోయిన్ గా లైం లైట్ లోకి వచ్చిన హీరోయిన్ షాలిని పాండే. ఈ సినిమా తరువాత ఆమెకి పెద్ద పెద్ద ఆఫర్స్ రాకపోవడంతో అందరూ ఈమెకి సరైన బ్రేక్ రాదేమో అని అనుకున్నారంతా...

అయితే ఈ తరుణంలో ఆమెకి మహానటి చిత్రంలో ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఆ తరువాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంలో షాలిని పాండే కి ఒక మంచి పాత్ర దొరికేసిందట. దీనికి యంగ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే మెయిన్ లీడ్ లో నటిస్తుండగా షాలిని పాండే కి మరొక ముఖ్య పాత్రలో కనపడనుంది. అయితే ఆ పాత్ర ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.

చూద్దాం.. ఈ సినిమా ఆమెకి సరైన బ్రేక్ ఇస్తుందా లేదా అని..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS