భారీ అంచనాలతో విడుదలైన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో భారీగా నిరాశ పడిన అల్లు అర్జున్ తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, సురేందర్‌రెడ్డి ఇలా పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నా, వీరిలో బన్నీ ఎవరికి కమిట్ అయ్యాడన్న విషయం కరెక్ట్‌గా తెలిసి రావడం లేదు. కానీ ఈ ముగ్గురూ ప్రస్తుతం బిజీగానే ఉన్నారు.
ఇకపోతే 'సూర్య' ఇచ్చిన ఎఫెక్ట్‌తో బన్నీ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తనకి 'రేసుగుర్రం' సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డికే ఓటేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సురేందర్ రెడ్డి ప్రస్తుతం 'సైరా' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌కి గానీ పూర్తి కాదు. అంటే అంతవరకూ బన్నీ సినిమా పట్టాలెక్కేదే లేదా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
సురేందర్ రెడ్డితో సినిమా కోసం ఆల్రెడీ స్క్రిప్టు వర్క్ నడుస్తోందట. అయితే అంత గ్యాప్ తీసుకుంటాడా బన్నీ. ఒకవేళ అదే జరిగితే, బన్నీ అభిమానులకు ఇది చేదు వార్తే. ఒకవేళ త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా చేయాలనుకుంటే, ఈ దసరాకి త్రివిక్రమ్ ఫ్రీ అయిపోతాడు. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'అరవింద సమేత..' చిత్రం ఈ దసరాకి పూర్తి కానుంది.
సో త్రివిక్రమ్‌తో ఒకవేళ బన్నీ సినిమా కన్‌ఫామ్ అయితే అతి త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ లేకపోలేదు. అయితే 'అరవింద సమేత' రిజల్ట్‌ని బట్టి త్రివిక్రమ్‌తో సినిమాకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా లేడనీ మరోవైపు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారమ్. చూడాలి మరి, బన్నీ ఏం చేస్తాడో.