బన్నీ స్పీడుకి తాజా అప్‌డేట్‌!

By iQlikMovies - May 10, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా తాజాగా ఫస్ట్‌ షెడ్యూల్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకుంది. అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట. ఇక రెండో షెడ్యూల్‌ని భారీగా ప్లాన్‌ చేస్తున్నారట. ఇది లాంగ్‌ షెడ్యూల్‌ కావడంతో కొన్ని రోజులు జస్ట్‌ అలా రిలాక్స్‌ అయ్యి వచ్చేస్తానని బన్నీ, త్రివిక్రమ్‌కి సూచించాడట. దాంతో షూటింగ్‌ నుండి తాత్కాలిక బ్రేక్‌ తీసుకుంది బన్నీ అండ్‌ టీమ్‌.

 

ఇదిలా ఉంటే, బన్నీ తదుపరి ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్‌తో ఓ సినిమా, యంగ్‌ డైరెక్టర్‌ సుధీర్‌ వర్మతో 'ఐకాన్‌' సినిమా చేయనున్నాడు బన్నీ. అయితే, ఈ రెండు సినిమాలనూ ఒకేసారి సమాంతరంగా చేయాలన్నదే బన్నీ అభిప్రాయమట. కొంచెం కష్టమైనా, అభిమానుల కోసం ఆ రిస్క్‌ చేయక తప్పదంటున్నాడు బన్నీ. సుకుమార్‌తో సినిమా మరి కొద్ది రోజుల్లోనే లాంఛనంగా ప్రారంభం కానుందనీ తాజా సమాచారమ్‌. సుకుమార్‌ సినిమాలో రష్మికా మండన్నాని హీరోయిన్‌గా అనుకుంటున్నారు.

 

ఇక సుధీర్‌ వర్మ 'ఐకాన్‌' కోసం బాలీవుడ్‌ భామ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఆ లిస్టులో శ్రద్ధాకపూర్‌, కైరా అద్వానీ, అలియా భట్‌ పేర్లు ఆల్రెడీ లిస్టులో ఉండగా, మరో కొత్త భామ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఆల్రెడీ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. మరి బన్నీ వీరిలోంచే ఒకరిని ఎంచుకుంటాడా.? లేక కొత్త భామని దిగుమతి చేస్తాడా.? అనేది చూడాలిక. మొత్తానికి బన్నీ అయితే, వీలైనంత ఎర్లీగా లైన్‌లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్‌ చేయాలనుకుంటున్నాడట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS