భారీ అంచనాలతో విడుదలైన చిత్రం మహర్షి. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే తొలి రోజు వసూళ్లతో టాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించింది మహర్షి. గురువారం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి రికార్డు స్థాయిలో 24.6 కోట్లు సాధించింది.
నైజాంలో అత్యధికంగా రూ.6.38 కోట్లు తెచ్చుకుంది. బాహుబలి 1 రికార్డుని మహర్షి బద్దలు కొట్టింది. బాహుబలికి రూ.6.28 కోట్లు వస్తే.. మరో పది లక్షలతో ఆ రికార్డు క్రాస్ చేసింది మహర్షి. సీడెడ్‌లో 2.89 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.88కోట్లు, ఈస్ట్‌లో 3.2 కోట్లు, వెస్ట్‌లో 2.46 కోట్లు, కృష్నాలో 1.39 కోట్లు, గుంటూరులో 4.4 కోట్లు, నెల్లూరులో 1 కోటీ తెచ్చుకుంది. మహేష్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్స్. థియేటర్లో టికెట్ రేట్లు పెరగడం, అత్యధిక ప్రింట్లతో ఈ సినిమాని విడుదల చేయడం, వేసవి సీజన్ కావడం.. మహర్షికి బాగా కలిసొచ్చాయి.
చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డుల్ని దాటుకెళ్లింది. శుక్ర, శని, ఆదివారాలలో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయన్నదాన్నిబట్టి... మహర్షి రేంజ్ ఆధారపడి ఉంది.