కామ్రేడ్‌తో మహేష్‌ మల్టీ స్టారర్‌?

మరిన్ని వార్తలు

ఇప్పుడు విజయ్‌ దేవరకొండ పేరు చెబితే రికార్డులు, సంచలనాలు ఉలిక్కిపడుతున్నాయి. ఆ రేంజ్‌లో ఉంది ఆయన క్రేజ్‌. అందుకే మన దర్శక, నిర్మాతలు విజయ్‌తో సినిమా అంటే ఎగిరి గంతేస్తున్నారు. ఆల్రెడీ విజయ్‌ దేవరకొండ చేతిలో ఐదారు క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో 'డియర్‌ కామ్రేడ్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే, ఈ మధ్య సూపర్‌స్టార్‌ మహేష్‌తో కలిసి విజయ్‌దేవరకొండ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు, 'మహర్షి' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో విజయ్‌ దేవరకొండ హల్‌చల్‌ చేశాడు.

 

వేదికపై మహేష్‌ కంటే ఎక్కువగా మాట్లాడి, ఆడియన్స్‌లో ఉత్సాహం నింపాడు. ఇక తాజాగా తన బర్త్‌డే సందర్భంగా మహేష్‌బాబు ఇంట్లో బర్త్‌డే పార్టీ సెలబ్రేట్‌ చేసుకున్నాడు మన రౌడీ. విజయ్‌ దేవరకొండ పుట్టినరోజే 'మహర్షి' సినిమా రిలీజ్‌ కావడం, నిజంగా ఈ పుట్టినరోజు తనకెంతో స్పెషల్‌ అనీ విజయ్‌ దేవరకొండ మురిసిపోతున్నాడు. అందుకే తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని మహేష్‌ ఇంట్లో జరుపుకున్నాడు. మరోవైపు 'మహర్షి' ఓపెనింగ్స్‌ బాగుండడంతో టీమ్‌ కూడా టెన్షన్‌ నుండి రిలీఫ్‌ అయ్యి గ్రాండ్‌ పార్టీ సెలబ్రేట్‌ చేసుకుంది.

 

ఈ పార్టీలో 'మహర్షి' టీమ్‌తో పాటు, విజయ్‌ దేవరకొండ సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహేష్‌ - విజయ్‌ దేవరకొండ కెమిస్ట్రీ చూస్తుంటే, ఫ్యాన్స్‌ మదిలో ఓ చిలిపి ఆలోచన మెదిలినట్లయ్యింది. విజయ్‌ దేవరకొండ, మహేష్‌బాబు కలిసి మల్టీ స్టారర్‌ చేస్తే బాగుంటుందని ఇరు వర్గాల ఫ్యాన్స్‌ యోచిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే, వసూళ్ల సునామీ ధాటికి బాక్సాఫీస్‌ తట్టుకోగలదా.?!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS