అల్లు అర్జున్‌.. మూడు కాదు, నాలుగు!

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్‌ గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక సతమతమవుతున్నాడు. 'డిజె దువ్వాడ జగన్నాథమ్‌', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాల వైఫల్యాలతో షాక్‌ తిన్న అల్లు అర్జున్‌, ఈసారి మాత్రం పెర్‌ఫెక్ట్‌గా కెరీర్‌ని ప్లాన్‌ చేసుకుంటున్నట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న అల్లు అర్జున్‌, త్వరలోనే సుకుమార్‌ డైరెక్షన్‌లో సినిమాని పట్టాలెక్కించేయబోతున్నాడు.

 

అక్టోబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందట. ఆ వెంటనే, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో చేయబోయే 'ఐకాన్‌' సినిమా కూడా పట్టాలెక్కుతుందని సమాచారమ్‌. అంటే, వరుసగా మూడు సినిమాలు అల్లు అర్జున్‌ నుంచి రాబోతున్నాయన్నమాట. ఇవే కాదు, ఇంకో ప్రాజెక్ట్‌ విషయమై అల్లు అర్జున్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో తనతో కలిసి పనిచేసిన ఓ కమర్షియల్‌ డైరెక్టర్‌కి అల్లు అర్జున్‌ కమిట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ యువ దర్శకుడి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

 

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో వుందట. ఇది కాకుండా, పెద్ద హిట్‌ ఇచ్చి.. ఆ తర్వాత సినిమాల్లేక ఖాళీగా వున్న మరో టాలెంటెడ్‌ డైరెక్టర్‌కీ అల్లు అర్జున్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశముందని సమాచారమ్‌. ఆ దర్శకుడు ఆల్రెడీ అల్లు అర్జున్‌కి కథ విన్పించాడట. అయితే, ప్రస్తుతం ఒప్పుకున్న మూడు సినిమాలు పూర్తయ్యేదాకా కమిట్‌మెంట్‌ ఇవ్వలేనని సదరు దర్శకుడికి అల్లు అర్జున్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అంటే, నాలుగు కూడా కాదు.. దాదాపు ఐదు సినిమాల్ని అల్లు అర్జున్‌ లైన్‌లో పెట్టేసినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS