బిగ్‌బాస్ రియాల్టీ షోలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి 'ఆగడాలకు' హద్దూ అదుపూ లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకర్ని టార్గెట్‌గా చేసుకోవడం తప్ప, బిగ్ బాస్ మూడో సీజన్‌లో ఆమె ప్రత్యేకించి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నది లేదు. ట్రాన్స్‌జెండర్‌గా మారిన వైనం గురించి తాజా ఎపిసోడ్‌లో చెప్పుకుంది తమన్నా. అయితే, తమన్నా బిగ్‌హౌస్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో, అప్పటినుంచీ 'షో' రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని ప్రచారం జరుగుతోంది. తమన్నా వస్త్రధారణపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి.
బిగ్‌హౌస్‌లో గతంతో పోల్చితే ఈసారి గ్లామర్ ఎక్కువయ్యిందిగానీ, తమన్నా రాకతో అది జుగుప్సాకరంగా మారిపోయింది. వరుణ్ సందేశ్, రవికృష్ణ, అలీ రెజా.. ఇలా బిగ్ హౌస్‌లో తమన్నా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. యాంకర్ శ్రీముఖి మాత్రమే తమన్నాతో బాగా క్లోజ్ అవుతోంది. అలాగని మిగతావారు ఆమెను దూరం పెడుతున్నారని కాదు. ఓ విషయంలో వరుణ్ సందేశ్, తమన్నాని వెనుకేసురావడం వరుణ్ భార్య అయిన వితికకు నచ్చలేదు.
అయినాగానీ ఆ ఎపిసోడ్‌లో వరుణ్, తన భార్య వితికని కాకుండా తమన్నాకే ఓటేశాడు. తమన్నా మాట్లాడిందే కరెక్ట్ అనేవాడు. కానీ, తమన్నా మాత్రం వరుణ్ - వితికల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నించింది. నిన్నటి ఎపిసోడ్‌లో అలీ రెజాతో తమన్నా గొడవ పడిన తీరు అత్యంత దారుణం. షోలో కంటెస్టెంట్‌లా కాకుండా, కేవలం గొడవ కోసమే తమన్నా సింహాద్రిని నిర్వాహకులు ఆమెను ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది.