అల్లు అర్జున్‌తో విజయ్‌.. ఓ రేంజ్‌లో వుంటుందట.!

మరిన్ని వార్తలు

'అల వైకుంఠపురములో' సినిమా ఇచ్చిన సక్సెస్‌ జోష్‌తో తన తదుపరి సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌లో చూపించబోతున్నాడట అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమా నిర్మించనున్న విషయం విదితమే. ఈ సినిమా కోసం విజయ్‌ సేతుపతిని తీసుకుంది చిత్ర యూనిట్‌. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నాడు. 'రంగస్థలం' తర్వాత సుకుమార్‌ చేస్తోన్న సినిమా ఇదే కావడం గమనార్హం. శేషాచలం అడవులు - ఎర్రచందనం స్మగ్లింగ్‌.. వంటి కీలక అంశాల్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకుని ఈ సినిమాని సుకుమార్‌ తెరకెక్కించనుండడం గమనార్హం.

 

ఈ సినిమా కోసమే చిత్తూరు జిల్లా యాస తెలిసిన నటీనటుల్ని ఎంపిక చేశారు కూడా. విజయ్‌ సేతుపతికి తమిళ సినీ పరిశ్రమలో వున్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో తమిళ - తెలుగు భాషల్లో ఈ సినిమాని రూపొందించనున్నారట. ఎలాగూ అల్లు అర్జున్‌ సినిమాలకి మలయాళంలో మంచి మార్కెట్‌ వుంటుంది గనుక.. అది అదనపు అడ్వాంటేజ్‌. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అన్నట్టు, ఈ సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'తో హిట్టు కొట్టిన రష్మిక మండన్న, అల్లు అర్జున్‌తో జతకట్టనుండడం మరో విశేషం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS