చిత్రసీమలో విజయాలకే విలువ ఎక్కువ. ఓ ఫ్లాప్ పడిందంటే చాలు.. ఎంత ప్రతిభ ఉన్నా అనుమానంగా చూస్తారు. ఇప్పుడు విక్రమ్ కె.కుమార్ పరిస్థితి ఇదే.
13బి, మనం, 24 చిత్రాలతో తన స్టామినా ఏమిటో చూపించాడు. `హలో` ఫ్లాప్ అయ్యింది. దాంతో.. విక్రమ్ చేతిలో ఉన్న అవకాశాలు జారిపోయే ప్రమాదం వచ్చింది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తరవాత అల్లు అర్జున్ - విక్రమ్ కాంబో సెట్టయ్యింది. ఆగస్టులోనే ఈ సినిమా మొదలవ్వాల్సింది. కానీ ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన సమాచారమేదీ బయటకు రాలేదు.
`సెకండాఫ్ బన్నీకి నచ్చలేదని, అందులో మార్పులు చేస్తున్నార`ని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ సినిమాని బన్నీ పక్కన పెట్టేశాడని సమాచారం అందుతోంది. విక్రమ్ స్థానంలో త్రివిక్రమ్ సినిమాని బన్నీ పట్టాలెక్కిస్తాడని, దసరా సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
సో.. 'అరవింద' రిజల్ట్ ఎలా ఉన్నా...బన్నీ త్రివిక్రమ్ కే ఫిక్సయ్యాడన్నమాట.