క్రియేటివ్ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్‌తో బన్నీ సినిమా ఉండబోతోందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే 'డీజె', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలతో నిరాశపడిన బన్నీ తర్వాతి సినిమా కోసం కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాడనీ సమాచారం.
అందులోనూ అఖిల్‌తో 'హలో' సినిమా నిరాశపరిచిన కారణంగా విక్రమ్‌ని బన్నీ నమ్మలేకపోతున్నాడనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ గాసిప్స్‌లో నిజమెంతమాత్రమూ లేదనీ, బన్నీ - విక్రమ్ కుమార్ సినిమా కన్ఫామ్ అనీ తాజాగా అందుతోన్న సమాచారమ్. విక్రమ్‌ని అంత తేలిగ్గా అంచనా వేసేందుకు లేదు. బన్నీతో ఈ సారి ఏదో మ్యాజిక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడనీ తెలుస్తోంది. ఆల్రెడీ బన్నీకి కథ వినిపించాడు. కథ బన్నీకి బాగా నచ్చేసిందట. సో అన్నీ కుదిరితే సెప్టెంబర్‌లోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారనీ తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారట. ఈ సినిమా కోసం ముద్దుగుమ్మ రష్మికా మండన్నాని హీరోయిన్గా పరిశీలించే అవకాశాలున్నాయట.
మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్తోనూ బన్నీ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ 'అరవింద సమేత'తో బిజీగా ఉన్నాడు. దసరాకి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా చేయాలా? వద్దా? అనే డెసిషన్ తీసుకుంటాడట. చూడాలిక బన్నీ ఫ్యాన్స్‌ని ఖుషీ చేసే ఆ సూపర్ డూపర్ హిట్ ఎప్పుడు ఎవరితో ఇవ్వనున్నాడో మరి.!