చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'కి మరో మెగా హీరో గ్లామర్ యాడ్ అయ్యింది. ఆయన ఇంకెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆగండాగండి అంటే 'సైరా'లో అల్లు అర్జున్ నటిస్తున్నాడా.?
ఏంటీ.! అని ఆశ్చర్యపోకండి. 'సైరా' టీమ్‌లోఅల్లు అర్జున్ కూడా ఓ భాగం కానున్నాడట. అయితే స్క్రీన్‌పై కనిపించడు. వినిపిస్తాడట. అంటే ఈ సినిమాకి అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. తాజాగా ఈ విషయం బయటికి వచ్చింది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాణంలో మెగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే చిత్రమనీ తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుతో పాటు, ఇతర భాషలకు చెందిన హేమా హేమీ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అలాంటి ఈ మెగా ప్రాజెక్ట్‌కి అల్లు అర్జున్ గొంతు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత బన్నీ కొత్త చిత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ సినిమా కన్‌ఫామ్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది కానీ, అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే జరగలేదింతవరకూ.
ఒకవేళ ఈ లోగా ఏదో ఒక సినిమా కన్‌ఫామ్ చేసినా ఆ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు కూడా ఉండవు. సో 'సైరా'కి బన్నీ వాయిస్ ఇవ్వడం ఒకవేళ నిజమే అయితే ఆ రకంగా అయినా బన్నీ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతారుగా మరి.