రవితేజతో ఇలియానా ఇంకోస్సారి.?

By iQlikMovies - November 20, 2018 - 15:26 PM IST

మరిన్ని వార్తలు

ఇటీవలే రవితేజతో 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన గోవా బ్యూటీ ఇలియానా మరోసారి రవితేజతోనే జత కట్టనుందట. అయితే ఈ సారి హీరోయిన్‌గా కాదట. జస్ట్‌ గెస్ట్‌ రోల్‌ చేయనుందనీ ప్రచారం జరుగుతోంది. రవితేజ - వి.ఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. 

ఈ సినిమాలో ఆల్రెడీ 'ఆర్‌ఎక్స్‌' బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌, 'నన్ను దోచుకుందువటే' ఫేం నభా నటేష్‌ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అయితే తాజాగా ఇలియానా పేరును రవితేజ ప్రిఫర్‌ చేశాడనీ తెలుస్తోంది. ఈ సినిమాలో ఇలియానా ఓ చిన్న గెస్ట్‌ రోల్‌ పోషిస్తోందట. ఆ క్యారెక్టర్‌ కోసం స్క్రిప్టులో కావాలని కొన్ని మార్పులు చేయించాడట రవితేజ. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎంత ప్రయత్నం చేసినా సరైన ఆఫర్‌ రాని ఇలియానాకి రవితేజ రూపంలో 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ఆఫర్‌ దక్కింది. 

ఈ సినిమా హిట్టా? ఫట్టా? అనే విషయం పక్కన పెడితే, మరోసారి రవితేజ, ఇలియానాకి ఛాన్సివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏది ఏమైతేనేం రవితేజ - ఇలియానా మధ్య స్నేహం అలాంటిది. ఎంతమంది నో అన్నా, తన స్నేహితురాలికి వరుస ఆఫర్లు ఇచ్చి ఆదుకుంటున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ అట. ఈ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 

ఇకపోతే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వి.ఐ.ఆనంద్‌ ఈ సారి మాస్‌రాజాతో ఎలాంటి ప్రయోగం చేయనున్నాడో చూడాలి మరి. రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS