విదేశాల్లో సినిమా షూటింగ్స్‌: ఇకపై హుళక్కే.!

మరిన్ని వార్తలు

బడ్జెట్‌తో సంబంధం లేకుండా, స్టార్‌ కాస్టింగ్‌తో అస్సలే సంబంధం లేకుండా, విదేశాల్లో సినిమా షూటింగ్స్‌కి పెట్టే, బేడా సర్దుకుని ఎగిరి గంతేసుకుంటూ వెళ్లిపోయేవారు మనోళ్లు. కానీ, కరోనా దెబ్బతో, విదేశాల్లో షూటింగ్‌ అంటే బాబోయ్‌ అని భయపెడుతున్న రోజులొచ్చేశాయిప్పుడు. ఇంతవరకూ ప్లాన్‌ చేసుకున్న విదేశీ షెడ్యూల్స్‌లో చాలా వరకూ వాయిదా పడిపోగా, ప్రబాస్‌ మాత్రం చాలా కష్టపడి జార్జియా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని వచ్చాడు. యూరప్‌లో చేయాల్సిన షూటింగ్‌ని జార్జియాలో కంప్లీట్‌ చేసుకుని వచేసాడు.

 

ఇకపై ఈ సినిమాని స్వదేశంలోనే చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే, ప్రబాస్‌ సినిమానే కాదు, చాలా చాలా సినిమాలు ఇప్పటికే కథానుగుణంగా విదేశాల్లో షూటింగ్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. కానీ, అవన్నీ జరిగేనా.? అంటే ఏమో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కరోనా ఓ దారికొచ్చి, ఎక్కడిదక్కడ అంతా సెట్‌రైట్‌ అయిపోయినా ఈ కరోనా భయం ఇప్పట్లో తీరేది కాదు. ఏది ఏమైనా కరోనా మన ఫిలిం మేకర్స్‌కి ఓ పెద్ద గుణపాఠమే నేర్పిందనాలి. అయితే, విదేశాల్లో షూటింగ్స్‌కి అలవాటు పడిన మనోళ్లు ఆగుతారా.? అనేది వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS