పాప సీన్ల‌న్నీ క‌త్తిరించేశారు... పాపం!!

By iQlikMovies - October 04, 2018 - 10:55 AM IST

మరిన్ని వార్తలు

త్రివిక్ర‌మ్ సినిమాలో రెండో క‌థానాయిక‌గా మెరిసిన‌వాళ్లెవ్వ‌రికీ స‌రైన సినిమాలు రాలేదు. 'అత్తారింటికి దారేది'లో ప్ర‌ణీత గుర్తుంది క‌దా?  ఆ సినిమా త‌ర‌వాత అస్స‌లు ప్ర‌ణీత‌కు అవ‌కాశాలే రాలేదు. అంత‌కు ముందు 'జ‌ల్సా'లో పార్వ‌తీ మెల్ట‌న్ ప‌రిస్థితీ అంతే.  ఆ సినిమా త‌ర‌వాత  పార్వ‌తి అస్స‌లు క‌నిపించ‌నే లేదు. `అజ్ఞాత‌వాసి`తో అనూ ఇమ్మానియేల్ సాధించిందేం లేదు. అందుకే.. త్రివిక్ర‌మ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే.. క‌థానాయిక‌లు ఆలోచిస్తుంటారు

. కానీ ఈషా రెబ్బా మాత్రం 'ఓ.. ఎస్‌' అనేసి ఈ సినిమా ఛాన్స్ అందుకుంది. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అంతో ఇంతో గుర్తింపు తెచ్చుకుంది ఈషా.  తెలుగ‌మ్మాయి కోటాలో 'అర‌వింద స‌మేత‌'లో ఓ కీల‌క పాత్ర ద‌క్కించుకుంది. ఈ సినిమా ద్వారా త‌న కెరీర్‌కి స‌రికొత్త ఊపు వ‌స్తుంద‌ని భావిస్తోంది.

అయితే తాజా స‌మాచారం ఏమిటంటే.... 'అర‌వింద స‌మేత‌'లో ఈషారెబ్బా న‌టించిన కొన్ని స‌న్నివేశాల‌కు సెన్సార్ ముందే క‌త్తెర్లు వేసేశార్ట‌.  నిడివి దృష్ట్యా త్రివిక్ర‌మ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.  నిజానికి స్క్రిప్టు ద‌శ‌లోనే ఈషా రెబ్బా పాత్ర‌కు క‌త్తెర్లు ప‌డిపోయాయ‌ట‌. ముందు అనుకున్న క‌థ ప్ర‌కారం ఈషాకి మంచి సీన్లే ప‌డ్డాయ‌ని... అయితే ఆ త‌ర‌వాత క‌థ‌లో జ‌రిగిన మార్పుల వ‌ల్ల‌... ఈషా పాత్ర కుదించుకుపోయింద‌ని టాక్‌. 

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమాల్లో భ‌లే ఛాన్సొచ్చింద‌ని మురిసిపోయిన ఈషా ఆనందానికి `క‌త్తెర‌` ప‌డిపోయింద‌న్న‌మాట‌. సో.. శాడ్ క‌దూ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS