'బాఘీ' కోసం ఈ సారేం తెలుగు సినిమానో తెలుసా.?

By iQlikMovies - December 20, 2018 - 11:28 AM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నటించిన 'బాఘీ' సిరీస్‌ మూవీస్‌ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. ఇప్పుడు ఆ సిరీస్‌లో మూడో చిత్రం రానుంది. సిరీస్‌ అయినా, ఏ సినిమాకీ స్టోరీ పరంగా సంబంధం ఉండదు. మొదటి పార్ట్‌ కోసం తెలుగులో 'వర్షం' సినిమాని రీమేక్‌ చేయగా, రెండో పార్ట్‌ కోసం 'క్షణం' మూవీని ఎంచుకున్నాడీ బాలీవుడ్‌ బ్రూస్‌లీ. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం కోసం ఏ తెలుగు సినిమాపై కన్నేశాడో కానీ, ఖచ్చితంగా ఓ హిట్‌ మూవీని ఎంచుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

 

మనోడికి టాలీవుడ్‌ హీరోల్లో స్లైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టమని గతంలో ఓ సారి చెప్పాడు. ఒకవేళ ఈ సారి అల్లు అర్జున్‌ సినిమాపై కన్నేశాడా.? అంటే అవునంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అల్లు అర్జున్‌ కెరీర్‌ బ్లాక్‌ బస్టర్స్‌ అయిన 'రేసుగ్రురం', 'సరైనోడు' సినిమాల్లో ఏదో ఒకటి తన 'బాఘీ 3' కోసం టైగర్‌ ష్రాఫ్‌ ఎంచుకోనున్నాడనీ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి స్టోరీని ఎంచుకున్నా, మనోడు ఆ స్టోరీని తన యాక్షన్‌తో ప్యాక్‌ చేసేస్తాడు. ఇక ఈ రెండు సినిమాలూ యాక్షన్‌ పరంగా బ్లాక్‌ బస్టర్సే. ఇక ఈ సినిమాలను ఎంచుకుంటే మనోడి కండల మధ్య యాక్షన్‌ సీన్స్‌ ఎలా నలిగిపోతాయో కదా. 

 

ఇదిలా ఉంటే, కాదు కాదు ఈ సారి తెలుగు రీమేక్‌ కాదు, తమిళ రీమేక్‌ అంటున్నారు ఇంకొందరు. కాదు ఈ సారి పూర్తిగా కొత్త స్టోరీ పట్టుకొస్తాడని మరికొందరంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మరోసారి దిశాపటానీనే తీసుకుందామనుకుంటున్నారట. అయితే కొంచెం కొత్తగా ఉంటుందని కొత్త భామ సారా అలీఖాన్‌ని పరిశీలిస్తున్నారట. చూడాలి మరి ఈ రొమాంటిక్‌ హీరోతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ చేసే ఆ ముద్దుగుమ్మ ఎవరో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS