'బాఘీ 3' వచ్చేస్తుంది. కానీ..!

మరిన్ని వార్తలు

సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ నటించిన 'బాఘీ' చిత్రాలకు సీక్వెల్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌ తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన 'వర్షం' మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. బాలీవుడ్‌లోనూ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో ప్రతినాయకునిగా టాలీవుడ్‌ హీరో సుధీర్‌బాబు నటించాడు. ఈ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'బాఘీ 2' కూడా తెలుగులో విడుదలైన 'క్షణం' మూవీకి రీమేక్‌గా రూపొందింది. ఈ రెండు సినిమాలూ బాలీవుడ్‌లో కూడా మంచి విజయాలు అందుకున్నాయి. 

 

అయితే ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో పార్ట్‌ రానుంది. అదే 'బాఘీ 3'. ఈ సినిమాకి ఏ స్టోరీని ఆధారంగా చేసుకున్నారో తెలీదు కానీ, తొలి రెండు పార్ట్స్‌కి మించిన రేంజ్‌లో ఈ సినిమా మేకింగ్‌ ఉండబోతోందట. రెండు పార్ట్స్‌లోనూ యాక్షన్‌ ఘట్టాలకు పెద్ద పీట వేశారు. టైగర్‌ ఫ్రాఫ్‌ అంటేనే యాక్షన్‌ కటౌట్‌. సో ఈ సినిమాలో కూడా యాక్షన్‌, అండ్‌ రొమాన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందట. లేటెస్టుగా విడుదలైన 'బాఘీ 3' కాన్సెప్ట్‌ పోస్టర్‌లో సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. 2020 మార్చి 6న 'బాఘీ 3' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయం చాలా ఎక్కువ. 

 

అందుకే 'హీ విల్‌ రిటర్న్‌, సినిమా ఆలస్యంగా రాబోతోంది కదూ..ఇది వార్మప్‌లాంటిది. ఎందుకంటే ఇప్పుడేగా మొదలైంది..' అనే క్యాప్షన్‌తో క్లియర్‌ కట్‌గా వివరణ ఇచ్చేసింది చిత్రయూనిట్‌. మొత్తానికి 'బాఘీ' సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలూ విజయవంతం కావడంతో మూడో పార్ట్‌ పైనా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అలీఖాన్‌, దిశాపటానీ ఇద్దరు ముద్దుగుమ్మలు పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరు ఫైనల్‌ అవుతారో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS