అల్లు అర్జున్‌ ప్రేమకు ఆరేళ్లు.!

మరిన్ని వార్తలు

అదేంటీ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రేమకి ఆరేళ్లేంటీ .? స్నేహారెడ్డిని ఆయన లవ్‌ చేసి పెళ్లాడిరది 2011లో కదా.. అనుకుంటున్నారా.? నిజానికి ఆయనకు ప్రేమంటే ఏంటో తెలిసింది ఆయన కొడుకు అయాన్‌తోనేనట. ఈ రోజు అయాన్‌ ఆరవ పుట్టినరోజు. అయాన్‌ పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు బన్నీ. ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో నటించినా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అసలు సిసలు ప్రేమంటే ఆయనకు తెలిసింది కొడుకు అయాన్‌తోనేనట. కొడుకుపై తనకున్న అపారమైన ప్రేమను చాటుకునేలా ఉన్న ఈ పోస్ట్‌కి నెటిజన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

ఇకపోతే, మరో రెండు రోజుల్లో అల్లు అర్జున్‌ పుట్టినరోజు కూడా ఉంది. ఈ పుట్టినరోజుకు అల్లు అర్జున్‌ నుండి ఎలాంటి గిఫ్ట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయాలో ఏమో కానీ, ఆయన ప్రస్తుతం సుకుమార్‌ సినిమాలో నటిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ, కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఒకవేళ సెట్స్‌పై ఉండి ఉంటే, సినిమా నుండి ఏదో ఒక అప్డేట్‌ వచ్చి ఉండేది. మరోవైపు, అల్లు అర్జున్‌ కోసం ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, తన ఇంటెలిజెన్స్‌కి పదును పెట్టి, ఏదో సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసే ఉండి ఉంటాడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS