పాపం అల్లు శిరీష్‌ ఎంత పేదోడో.!

మరిన్ని వార్తలు

అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌ నెలవారీ బడ్జెట్‌ ఎంతో తెలుసా? బ్రేక్‌ ఫాస్ట్‌కి 1200, లంచ్‌కి 1500, డిన్నర్‌కి 1200, కరెంట్‌ బిల్‌ 100, ఇతరత్రా 300లు మొత్తం కలిసి 4500 రూపాయలు. రౌండ్‌ ఫిగర్‌ 5000 రూపాయలు. అంతే. 

ఏంటీ మెగాస్టార్‌ మేనల్లుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడు, స్లైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోదరుడు. అల్లు శిరీష్‌ బడ్జెట్‌ ఇంతేనా? అనుకుని అవాక్కవుతున్నారా? ఏంటీ. అయితే తప్పులో కాలేసినట్లే. ఈ బడ్జెట్‌ ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఎబిసిడీ - అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్‌డ్‌ దేశీ' చిత్రంలో ఆయన పోషిస్తున్న క్యారెక్టర్‌కి సంబంధించిన నెలవారీ బడ్జెట్‌ ఇది. ఇప్పుడో క్లారిటీ వచ్చింది కదా. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ అనుకోండిది. 

ఈ బడ్జెట్‌ని ఇలా గోడమీద రాసుకున్నాడు. ఆ పక్కనే ఓ గోడ గడియారం, దేవుడి ఫోటో ఉన్నాయి. అదీ సంగతి. ఈ సినిమాలో అల్లు శిరీష్‌కి జోడీగా 'కృష్ణార్జున యుద్ధం' ఫేం రుక్సార్‌ మీర్‌ నటిస్తోంది. చైల్డ్‌ ఆర్టిస్టుగా సత్తా చాటిన మాస్టర్‌ భరత్‌ ఈ సినిమాలో తొలిసారిగా టీనేజ్‌ క్యారెక్టర్‌ పోషిస్తున్నాడు. అల్లు శిరీష్‌కి ఫ్రెండ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ క్యారెక్టర్‌ సినిమాకి కీలకమని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందీ సినిమా. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం' సినిమాలతో సక్సెస్‌ కొట్టి జోరు మీదున్నాడు అల్లు శిరీష్‌. ఆ తర్వాత వస్తున్న సినిమా ఇదే కావడంతో కాస్త అంచనాలు ఉన్న మాట వాస్తవమే. అయితే సినిమా విడుదలైతే కానీ రిజల్ట్‌ ఊహించలేం కదా. సో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS