బిగ్‌బాస్ షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ముద్దుగుమ్మ పూజా రామచంద్రన్‌ని ఈ వారం సింపుల్‌గా ఎలిమినేట్ చేసేశారు. అసలెందుకు పూజని తీసుకొచ్చారు. ఎందుకు పంపించేశారో తెలియదు కానీ, ఒక్క విషయమైతే బాగా అర్ధమవుతోంది. గ్లామర్ కోసమే పూజను తీసుకొచ్చారు. ఏం చెప్పి తీసుకొచ్చారో కరెక్ట్‌గా అదే చేసింది. ఫుల్‌గా గ్లామర్ షో చేసింది. పొట్టి పొట్టి దుస్తుల్లోనే ఎక్కువగా కనిపించి కిర్రాక్ పుట్టించింది.
అంతకు ముందున్న బిగ్‌బాస్ సెలబ్రిటీస్ తేజస్విని, నందిని, దీప్తి, సంజన తదితరులు ఎంత విచ్చలవిడిగా గ్లామర్ పండించినా, అంతగా రిజిస్టర్ కాలేదు. పూజనే ఎక్కువగా రిజిస్టర్ అయ్యింది. కానీ ఏం లాభం పాపం వచ్చినట్లే వచ్చి, వెళ్లిపోయింది. సినిమాల్లో కూడా వచ్చి వెళ్లిపోయే క్యారెక్టర్సే ఎక్కువగా దక్కుతుంటాయ్ పూజా రామచంద్రన్‌కి. పూర్తి స్థాయి హీరోయిన్‌గా కన్నా, సెకండ్ హీరోయిన్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది పూజా రామచంద్రన్. బిగ్‌బాస్‌లో కూడా అదే తరహా క్యారెక్టర్ దక్కినట్లుంది.
రావడం రావడమే టాస్క్‌లు ఇరగదీసేసింది. బిగినింగ్‌లో పూజా ఎనర్జీ చూసి, బిగ్‌బాస్ ఫైనల్‌లో గట్టి పోటీ ఇస్తుందని భావించారంతా. కానీ ప్రేక్షకుల తీర్పు మరోలా ఉంది. పూజాలో బిగినింగ్‌లో ఉన్న ఎనర్జీ రాను రాను తగ్గుతూ వచ్చింది. దాంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు ఆడియన్స్.
రాఖీ పండగ సందర్భంగా నాని బిగ్‌హౌస్‌లో కాస్సేపు సందడి చేశాడు. అక్కడే పూజా ఎలిమినేషన్ అనౌన్స్ చేసేసి, తనతో పాటు హౌస్ నుండి బయటికి తీసుకొచ్చేశాడు. అదీ అలా బిగ్‌హౌస్‌లో పూజా జర్నీ ముగిసిపోయింది.