అల్లు శిరీష్‌ ఎంత మంచోడో.!

By iQlikMovies - September 28, 2018 - 17:40 PM IST

మరిన్ని వార్తలు

అభిమానులకు సాయం చేయడంలో హీరోలు ఎప్పుడూ ముందుంటారు. వీలు చిక్కితే సాయం అందించేందుకు ముందుకొస్తుంటారు. అలా ఇప్పుడు మెగా కాంపౌండ్‌ హీరో అల్లు శిరీష్‌ తన అభిమానికి సాయం చేశాడు. సోషల్‌ మీడియాలో తనకు ఓ అభిమాని పెట్టిన మెసేజ్‌కి స్పందించి వెంటనే సాయమందించాడు. ఇంతకీ అల్లు శిరీష్‌ చేసిన సాయమేంటో తెలుసా? ల్యాప్‌టాప్‌. అల్లు శిరీష్‌కి తన అన్న అల్లు అర్జున్‌ రీసెంట్‌గా ఓ యాపిల్‌ ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఈ విషయమై తన అన్న అల్లు అర్జున్‌కి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు అల్లు శిరీష్‌. 

అల్లు అర్జున్‌ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ ఫోటో కూడా పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ చూసిన ఓ అభిమాని 'అన్నా నాకు కూడా ఏదో ఒక ల్యాప్‌టాప్‌ ఇప్పించండి.. నాకు వచ్చే చాలీ చాలని జీతంతో ల్యాప్‌ టాప్‌ కొనుక్కునేందుకు కనీసం మూడేళ్లయినా పడుతుంది. నాకు ఫ్యామిలీ ఉంది.. వీలైతే, నాకీ సాయం చేయమని అల్లు శిరీష్‌ని కోరాడు ఆ అభిమాని. ఆ మెసేజ్‌కి వెంటనే స్పందించిన అల్లు శిరీష్‌ తాను అంతకు ముందు వరకూ వాడుతున్న ల్యాప్‌టాప్‌ని ఆ అభిమానికి పంపించాడట. అలా పెద్ద మనసు చాటుకున్నాడు మన అల్లు వారబ్బాయ్‌. 

అందుకే అల్లు శిరీష్‌ ఎంతో మంచోడో కదా. ప్రస్తుతం అల్లు శిరీష్‌ 'ఎబీసీడీ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు శిరీష్‌ పాత్ర కూడా చాలీ చాలని జీతంతో గడిపే ఓ సగటు కుర్రాడి పాత్రే అని గతంలో విడుదల చేసిన ఓ పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS