'రంగస్థలం', 'మహానటి', 'యూటర్న్' చిత్రాలతో మంచి విజయాలను అందుకుని, పెళ్లి తర్వాత కెరీర్‌ని ఇంత బాగా డెవలప్ చేసుకుంటుందో సమంత అని అందరి చేత మెప్పులు పొందుతోంది ఈ మధ్య సమంత.
అయితే తాజాగా సమంత హాలీడే వెకేషన్ నిమిత్తం విదేశాల్లో భరత్త చైతన్యతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఎంజాయ్ చేస్తే చేసింది కానీ, ఆ ఎంజాయ్మెంట్లో భాగంగా కొన్ని అభ్యంతరకర ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో సమంతకు చాలా చాలా ఫాలోయింగ్ ఉంది. ఈ ఫోటోలను కొందరు నెటిజన్లు ఇబ్బందికరంగా ఫీలవుతున్నారు. దాంతో సమంతకు కొన్ని ఉచిత సలహాలిస్తున్నారట. ఆ ఉచిత సలహాలకు తాజాగా సమంత స్పందించింది.
'పెళ్లి తర్వాత తాను ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఎలా ఉండాలి.. అని సలహాలిచ్చే నెటిజన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు..' అంటూ ఓ సింబల్‌ని పోస్ట్ చేసింది. ఎలాంటి కామెంట్స్ వచ్చినా నాకు డోంట్ కేర్ అని అర్ధం వచ్చేలా ఉంది ఆ సింబల్. అంటే నెటిజన్స్‌కి కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చింది సమంత. నెటిజన్స్ రెస్పాన్స్ ఇలా ఉంటే, పలువురు సినీ ప్రముఖులు మాత్రం సమంతకు హ్యాట్సాఫ్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
హద్దుల్ని బ్రేక్ చేసేయ్. నీ వైఖరికి కుడోస్ అంటూ కమెడియన్ విద్యుల్లేఖారామన్ ట్వీట్ చేసింది. అలాగే సమంత కుటుంబ సభ్యులైన నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కూడా సమంతకు సపోర్ట్‌గా నిలిచారు.