'సైరా'పై మెగా గాసిప్‌ ఇది నిజమేనా?

By iQlikMovies - September 28, 2018 - 11:19 AM IST

మరిన్ని వార్తలు

చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా'లో ఓ సన్నివేశం కోసం 50 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట. అది భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ అని సమాచారమ్‌. పది నిమిషాలకు పైగా ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమాలో కనిపిస్తుందట. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌తో పాటు ఇండియాలో ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ని ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం రంగంలోకి దించుతున్నట్లు సమాచారమ్‌.

 

'సైరా' టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా సినిమా బడ్జెట్‌ గురించి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన చరణ్‌ ఎంత అవసరమో అంత ఖర్చు చేస్తున్నాం. ఇంతా అంతా అని చెప్పలేం కానీ, బడ్జెట్‌ ఎక్కువే ఉంటుంది. అని చెప్పాడు. ఆయన మాటల్లోనే అర్ధమైంది ఈ సినిమా భారీ బడ్జెట్‌ కాదు, అతి భారీ బడ్జెట్‌ సినిమా అని. చరణ్‌ చెప్పినట్లుగా ఆ అవసరానికి తగ్గట్లే ఈ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని డిజైన్‌ చేశారట. 

ప్రస్తుతం విదేశాల్లో 'సైరా' షూటింగ్‌ జరుగుతోంది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో విదేశీ ఆర్టిస్టులు కూడా వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. సినిమాలోని కీలక తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారట. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS