యంగ్ హీరో అల్లు శిరీష్ సరికొత్త ఉద్యమానికి నాంది పలికారు. గో లోకల్ బీ వోకల్ అనే హ్యాష్ ట్యాగ్ తో శిరీష్ మొదలుపెట్టిన ఈ ఉద్యమం ప్రస్తుతం ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతుంది. ప్రతి భారతీయుడు కుదిరినంత వరకు విదేశి బ్రాండ్ల వాడకాన్ని తగ్గించాలి. మన వద్ద ప్రత్యామ్నాయం లేకపోతేనే అది కూడా స్వదేశ యేతర ఉత్పత్తి వాడాలి. అంతేగాని ప్రతి అవసరానికి విదేశి ఉత్పత్తలు వాడకూడదని శిరీష్ పిలుపునిచ్చారు. అంతేకాదు తానే స్వయంగా మార్కెట్ కి వెళ్లి ఏరికోరి భారతీయ బ్రాండ్లను వెతుకి మరీ కొన్నారు.
వీలైనంత వరకు అందరూ ఇలాగే చేయండి అంటూ తాను కొన్న భారతీయ ఉత్పత్తుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలానే చాలా మంది స్వదేశి వస్తువులను ఉపయోగిస్తున్న సరే బయటకి చెప్పరు, ఇక పై అలా కాకుండా మనం స్వదేశి ఉత్పత్తులను వాడుతున్నాము అని సగరవ్వంగా బయటకి వెల్లడించాలని శిరీష్ అన్నారు. శిరీష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటణతో పాటు కీలక విషయాలు అతిత్వరలో రాబోతున్నాయి.
I have made a conscious decision to use & support more Indian brands. I'm aware in a globalized world it may not be practical to avoid all foreign products, but let's buy local as much as possible. By consuming Indian brands we help our own economy. #GoLocalBeVocal
— Allu Sirish (@AlluSirish) June 17, 2020