'ఒక్క క్షణం' సినిమాతో సక్సెస్ అందుకున్నా, అల్లు శిరీష్ నుండి తదుపరి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అల్లు శిరీష్ హీరోగా 'ఏబీసీడీ - అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' టైటిల్‌తో ఓ సినిమా ఎప్పటి నుండో వార్తల్లో ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాకి సంబంధించి ఒక్క మోషన్ పోస్టర్ విడుదలైంది.. తప్ప మరో ఇన్‌ఫర్మేషన్ లేదీ సినిమా గురించి.
అయితే ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో రిలీజ్‌కి బ్రేకులు పడే అవకాశాలున్నట్లు తాజాగా సమాచారమ్ అందుతోంది. సమ్మర్ రిలీజ్ కోసం ఇప్పటికే చాలా సినిమాలు స్లాట్ బుక్ చేసేసుకున్నాయి. అందులో భాగంగా ఏప్రిల్ నెల్లో నాలుగువారాలు ఫుల్ ఫిల్ అయిపోయాయి. మేకి 'అర్జున్ సురవరం'తో నిఖిల్ బోణీ కొట్టేస్తున్నాడు. ఆ తర్వాత సూపర్‌స్టార్ 'మహర్షి' ఘనంగా వచ్చేస్తాడు. 'మహర్షి' ముందర చిన్న సినిమాలు నిలబడే అవకాశాల్లేవు. సో శిరీష్ సినిమా విడుదల చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఎలాగోలా సినిమా అయితే కంప్లీట్ చేశాడు. కానీ ఈ విడుదల చిక్కుల్లోనుండి శిరీష్ బయపడేదెలా.? ఆల్రెడీ మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీకి రీమేక్ కాబట్టి ఈ సినిమా విషయంలో శిరీష్ అండ్ టీమ్ కాన్ఫిడెంట్‌గానే ఉందట.
లేట్ అయినా 'అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' లేటెస్ట్‌గా రావడం ఖాయమంటున్నారు. చూడాలి మరి శిరీష్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో.