అప్పుడెప్పుడో 'గౌరవం' సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరచయమయ్యాడు అల్లు వారబ్బాయ్ శిరీష్. అఫ్‌కోర్స్ అదే సినిమాతో తెలుగులోనూ తెరంగేట్రం చేశాడనుకోండి. అయితే, ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేయలేదు అల్లు శిరీష్. తెలుగులో ఓ మోస్తరు హీరో అనిపించుకున్నాడు. కానీ స్టార్ హీరో అనిపించుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల 'ఏబీసీడీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే, లాంగ్ గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ తమిళ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు.
'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో అల్లు శిరీష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభం కానుందట. ఈ సినిమాలో అల్లు శిరీష్ రిచ్ లుక్‌లో కనిపిస్తూనే తన అమాయకత్వంతో నవ్వులు పూయించే పాత్రలో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే, నిజానికి అల్లు శిరీష్ ఈ మధ్య ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. సూర్య హీరోగా తెరకెక్కిన 'కాప్పాన్', తెలుగులో 'బందోబస్త్' పేరుతో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలోనే అల్లు శిరీష్ నటించాల్సి ఉంది. కానీ, లాస్ట్ మినిట్‌లో డేట్స్ అడ్జస్ట్ చేయలేక మిస్ చేసుకున్నాడు. ఈ సినిమాలో సూర్యతో పాటు మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటే శిరీష్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించాల్సి ఉంది ఈ సినిమాలో. ఒకవేళ ఈ సినిమాలో నటించి ఉంటే, అది శిరీష్ కెరీర్‌కి హెల్ప్ అయ్యి ఉండేది. బట్ బ్యాడ్ లక్.. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఏది ఏమైతేనేం.. ఎలాగైనా తమిళ తంబీల్ని ఇంప్రెస్ చేస్తానంటున్నాడు తాజా సినిమాతో. చూడాలి మరి, ఎలా ఇంప్రెస్ చేస్తాడో మన అల్లు వారబ్బాయ్.