డాన్సుల్లో బన్నీ టాపు. ఈ టాపు డాన్సర్ నుండి కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అదింకా టాపు. ఆ టాప్ కామెంట్స్ అందుకుంటోన్న ముద్దుగుమ్మ ఎవరో కాదు. పూజా హెగ్దే. 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాలో బన్నీకి జోడీగా నటిస్తోంది పూజా హెగ్దే. బన్నీ డాన్సులతో పోటీ పడడం చాలా కష్టమైందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. బన్నీ చాలా మంచి డాన్సర్. ఆయనతో డాన్సులు చెయ్యడం ఇంత కష్టంగా ఉంటుందనీ ఇప్పుడే తెలిసిందంటోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ 'ముకుందా', 'ఒక లైలా కోసం' చిత్రాల్లో నటించింది. ఆ సినిమాల్లో పెద్దగా డాన్సులు వేసే అవకాశం రాలేదు పూజా హెగ్దేకి. కానీ ఈ సినిమాలో డాన్సుల కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సి వచ్చిందంటోంది. 'అస్మైక యోగ.. ' పాటలో బన్నీతో సమానంగా పూజా డాన్స్ స్టెప్పులు అదరగొట్టేస్తున్నాయి. అలాగే ఈ సినిమా నుండి మరో ఆడియో సింగిల్ బయటికి వచ్పింది. ఈ పాటలో కూడా పూజా స్టెప్పులు ఇరగదీసేసింది. కొంచెం ఫాస్ట్ బీట్స్‌తో దుమ్ము దులిపేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బీట్స్‌కి పూజా వేసే స్టెప్పులకి మరి బన్నీ ఆమెని మెచ్చుయకోకుండా ఉండలేకపోతున్నాడు. బన్నీ మెప్పుకి పూజా హెగ్దే పొంగిపోతోందట. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.