ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌కి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 'కుమారి 21 ఎఫ్' సినిమాతో కుర్రకారు గుండెల్లో లవ్ రైళ్లు పరిగెత్తించేసింది. ఆ సినిమాతో ఈ ముద్దుగుమ్మ చాలా పాపులర్ అయిపోయింది. సుకుమార్ ఈ ముద్దుగుమ్మని ఆ సినిమాలో చాలా హాట్‌గా క్యూట్‌గా చూపించేశాడు. దాంతో కుమారి పేరుతో హెబ్బా పటేల్ పాపులర్ అయిపోయింది. ఆ సినిమాలో యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరగొట్టేసింది. అక్కడి నుండే స్టార్ట్ అయ్యింది రాజ్‌తరుణ్‌తో హెబ్బాకి సమ్ థింగ్ సమ్‌థింగ్ అంటూ. ఆ తర్వాత దాన్ని ఖండించడానికి రాజ్ తరుణ్ కిందా మీదా పడ్డాడు. అంతే కాదు ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా కూడా వచ్చింది. అదే 'ఈడో రకం ఆడో రకం'. కాగా అమ్మడు తర్వాత నటించిన 'నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్' సినిమాలో కూడా ముగ్గురు హీరోలతో ఎట్ ఎ టైమ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేసింది. దాంతో ఏ సినిమా చేస్తే ఆ సినిమా హీరోతో హెబ్బాకి ఎఫైర్ ఉందంటూ గాసిప్స్ చక్కర్లు కొట్టడం మొదలైంది. ఆ తర్వాత సదరు హీరోలు వాటిని ఖండించడం మామూలైపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'ఏంజెల్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా హీరో నాగ అన్వేష్‌తోనూ ఈ రకమైన గాసిప్సే చక్కర్లు కొడుతున్నాయి. హీరో నాగ అన్వేష్ మాత్రం అలాంటిదేం లేదంటున్నాడు. గాసిప్స్ అనేవి టైం పాస్ బఠాణీల్లాంటివి. వాటిని సీరియస్‌గా తీసుకోకూడదంటూ కొట్టి పారేస్తోంది ఈ ముద్దుగుమ్మ. స్వీట్‌గా హాట్‌గా ఉంటుంది కదా. హెబ్బాకి ఇవన్నీ మామూలే. సో ఆడియన్స్ మీరు కూడా ఏంటబ్బా... లైట్ తీస్కోండీ!