బన్నీ హీరోగా వస్తోన్న సినిమా 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' రేపే విడుదలవుతోంది. నిర్మాత దిల్ రాజు మార్కెటింగ్ స్ట్రాటజీ పక్కాగా ఉంది ఈ సినిమాకి. అందుకే చిత్ర యూనిట్ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉంది. తెలుగుతోపాటు మలయాళంలోనూ ఈ సినిమా విడుదల కానుంది. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్ళను సాధించనుందని గట్టిగా చెబుతోంది చిత్ర యూనిట్. అక్కడ బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అదీ కాక సినిమాని రిలీజ్ చేస్తున్న టైం కూడా పక్కాగా వర్కవుట్ కానుంది. సోమవారం రంజాన్ కావడంతో సెలవులు బాగా కలిసి రానున్నాయి ఈ సినిమాకి. సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. ఆకాశాన్నంటే అంచనాలు సినిమా ఓపెనింగ్స్‌ని బీభత్సంగా మార్చేయనున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా ప్రోమోస్‌లోనే 'కొట్టేస్తున్నాం, ఈ సారి గట్టిగా కొట్టేస్తున్నాం' అని అల్లు అర్జున్‌తో పవర్ ఫుల్‌గా డైలాగ్ చెప్పించారు. సినిమాపై నమ్మకం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'రేసుగుర్రం', 'సరైనోడు' చిత్రాలతో బన్నీ కెరీర్ బీభత్సమైన స్పీడ్‌తో ఉంది. ఆ స్పీడ్‌లోనే రాబోతున్న 'డీజె'తో బన్నీ వంద కోట్లు కొల్లగొట్టేస్తాడనుకోవచ్చు. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.