'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన బ్యూటీ అమైరా దస్తూర్‌కి వెల్కమ్ అంతగా కలిసి రాలేదు. కానీ అమ్మడిలో ఏదో తెలియని టాలెంట్ ఉంది. డిఫరెంట్ ఎట్రాక్షన్ ఉంది. సరైన ఛాన్స్ వస్తే యాక్టింగ్ టాలెంట్ ప్రదర్శించే సత్తా కూడా ఉంది.
ఇక గ్లామర్ విషయంలో నో లిమిట్స్. తొలి సినిమాతోనే అది ప్రూవ్ చేసేసుకుంది. తెలుగులో రెండో సినిమాగా యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో నటిస్తోంది. 'రాజుగాడు' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హిందీలోనూ ఓ డిఫరెంట్ మూవీలో అమైరా దస్తూర్ నటిస్తోంది. అదే 'రాజ్మా చావల్'. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో అమైరా ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తోంది. ఇటీవల తెలుగులో విడదలైన 'అ' చిత్రంలోని రెజీనా గెటప్‌ని పోలి వుండే గెటప్ అది. మెడ మీద టాటూతో, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో ముక్కుకు మక్కెరలాంటి ఆభరణంతో అమైరా కనిపించబోతోంది ఆ సినిమాలో. ఈ సంగతి అటుంచితే, ఈ తాజా పిక్‌లో చిన్న గౌను వేసుకుని, క్లీవేజ్ అందంతో మతులు పోగొట్టేస్తోంది హాట్ హాట్ అమైరా దస్తూర్.