లాక్ డౌన్ వల్ల పురుషుల్లోని కొత్త టాలెంట్లు బయటకు వస్తున్నాయి. మగాళ్లంతా... వంటింట్లో ప్రయోగాలు చేయడం మొదలెట్టారు. దాంతో.. శ్రీమతులకు కొంత రెస్ట్ దొరుకుతోంది. భర్తల పాక శాస్త్ర ప్రావీణ్యాన్నితెలుసుకునే వీలు చిక్కుతోంది. నాగార్జున కూడా ఇప్పుడు వంటల్లో ఆరితేరిపోయాడట. ఈ విషయాన్ని అమలనే స్వయంగా చెప్పింది. నాగార్జునకు పాక శాస్త్రంలో ప్రవేశం ఉందని, అద్భుతంగా వండి పెడతాడని కితాబు ఇచ్చింది.
అయితే.. సమంతకు మాత్రం వంట రాదట. తానెప్పుడూ తమ కుటుంబం కోసం వంట గదిలోకి వెళ్లలేదని తేల్చేశారామె. చైతూ మాత్రం మంచి వంటగాడు. అప్పుడుప్పుడూ తాను వంట గదిలో విజృంభిస్తుంటే, వాటికి సంబంధించిన ఫొటోల్ని సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంటే... చైతూ వండి పెడుతుంటే, సమంత తిని పెడుతుందన్నమాట. ఇంట్లో వంట చేసే భర్త ఉండగా, భార్యకు గరెటె పట్టుకోవాల్సిన పనేముంది? ఏంతైనా ఈ అత్తా కోడళ్లు అదృష్టంతులే.