సాయి ప్లవి ` నాగచైతన్య జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్మల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి పోస్టర్ ఎప్పుడో రిలీజ్ చేశారు. టైటిల్‌కి తగ్గట్లుగా హీరో, హీరోయిన్ మధ్య గాఢమైన ప్రేమను తెలిపేలా ఆ పోస్టర్ డిజైన్ చేశారనుకోండి. ఇక తాజాగా సినిమా పాటల సందడి మొదలవనుందట. లవర్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14న తొలి ఆడియో సింగిల్ రిలీజ్ చేయనున్నారట. రెహ్మాన్ శిష్యుడు పవన్ ఈ సినిమాకి హృద్యమైన మ్యూజిక్ అందిస్తున్నాడు. యూత్‌లో లవ్ గిలిగింతలు పెట్టించనుందట ఈ మ్యూజిక్.
ఇదిలా ఉంటే, ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెంటిమెంట్ ప్రకారమే కావచ్చు, కథ డిమాండ్ చేసిందనే కావచ్చు, ఈ సినిమాలోనూ సాయి పల్లవినే హీరోయిన్‌గా ఎంచుకోవడం శేఖర్ కమ్ముల బెస్ట్ ఛాయిస్ అనుకోవాలి. చైతూతో సాయి పల్లవి తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రమిది. అలాగే అసలు సిసలు నైజాం అమ్మాయి, అబ్బాయిగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్‌ని చూపించనున్నాడట డైరెక్టర్. సాయిపల్లవికి తెలంగాణా స్లాంగ్ కొట్టిన పిండే. చైతూకి మాత్రం కాస్త కొత్త కావడంతో, ఆ లాంగ్వేజ్‌పై పట్టు సాధించేందుకు బాగా కసరత్తు చేశాడట. అవుట్ పుట్ చాలా బాగా వస్తోందనీ సమాచారం. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.