2021 సంక్రాంతికి `ఆర్.ఆర్.ఆర్` వస్తోందని రాజమౌళి అండ్ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై పడింది. సంక్రాంతికి రావాలనుకున్న కొన్ని పెద్ద చిత్రాలు ఇప్పుడు వెనకడుగు వేశాయి. ఆ ఎఫెక్ట్ చిరంజీవిపైనా పడింది. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. `ఆచార్య` అనే పేరు ఖరారు చేశారు. 2021 సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అయితే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నారు.
ఆర్.ఆర్.ఆర్ వల్ల ఈ సినిమా వేసవికి వాయిదా పడింది. ఆచార్య ఇప్పుడు 2021 వేసవికే రాబోతోంది. ఈ యేడాది నవంబరు - డిసెంబరులో ఆచార్యని విడుదల చేద్దామన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే అప్పటికి ఈ సినిమా పూర్తయ్యే అవకాశం లేదు. అందుకే.. వేసవికి షిఫ్ట్ అయిపోయింది.